కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి నీటి సరఫరాను 5. 9 నుంచి 6. 9 ఎంజీడీలకు పెంచి ప్రజల నీటి కొరత తీర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కంటోన్మెంట్ అభివృద్ధికి రూ. 303. 64 కోట్లు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఇలాగే సహకారం అందించాలని మరోసారి కోరారు.