బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జోరుగా జరిగాయని బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ అన్నారు. సోమవారం బౌద్ధనగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పోటాపోటీగా అభివృద్ధి పనులు సాగాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో సీసీ రోడ్డు పనులను మంజూరైన రూ. 22 లక్షలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు.