హైదరాబాద్ ఫార్మా పరిశ్రమపై ఫైర్ సంబంధిత అంశాలపై తొలిసారిగా జాతీయ స్థాయి సదస్సుకు నగరం వేదిక కానుంది. దేశంలోనే అతి పెద్ద సెమినార్ నిర్వహణను ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఫైర్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ (ఫెసా-2024) పేరిట జరిగే ఈ సదస్సులో నిపుణులు చర్చించనున్నారని శనివారం బేగంపేటలో నిర్వాహకులు తెలిపారు.