అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ వద్దకు వెళ్లి మంగళవారం కలిశారు. స్థానిక అంశాల గురించి వివరించినట్లు తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్, కమ్యూనిటీ హాల్స్, గ్రేవ్ యార్డుల అభివృద్ధి, పార్కుల నోటిఫికేషన్ కోసం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.