అల్వాల్ డివిజన్ పరిధిలో దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో కొనసాగుతున్న బాక్స్ టైపు డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.