బీజేపీ, బీఆర్ఎస్ లు రెండు ఒక్కటేననిశుక్రవారం కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నిర్మల్ జిల్లా దిలవర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయంలోనే ఆ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చాయని చెప్పారు. తనకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వం ఎవరిని వదిలి పెట్టదన్నారు.