కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రగతి నగర్ లోని అనేక పార్కులలో బీర్లు, మందు బాటిల్స్, అనేక అసాంఘిక కార్యక్రమాలతో పిల్లలు వృద్ధులు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో ఉన్న పార్కులో అన్ని చెరువుకి దగ్గరగా ఉండటం వల్ల రాత్రుల సమయంలో మందుబాబులు ఆసాంఘిక కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.