సీఎం సహాయ నీది చెక్కులను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బుధవారం పేట్ బాషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సుభాష్ నగర్ డివిజన్ కు చెందిన షరీఫ్ కు రూ. 2, 50, 000, కుత్బుల్లాపూర్ కు చెందిన వేంకటేశ్వర రావుకు 2, 00, 00 విలువైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నీది ఆర్థిక భరోసాను ఇస్తుందన్నారు.