హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగాకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు.