జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్థిని నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ గురువారం కలిశారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అభివృద్ది పనులు, పెండింగ్ పనులపై చర్చించారు. వీటికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని, పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇందుకు గాను కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.