హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ సోదాలో మలక్పేట్-II సర్కిల్ కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారునికి బ్యాంక్ ఖాతాను డిఫ్రీజ్ చేయడానికి లేటర్ ఇవ్వడానికి లంచం అడిగినట్లు అధికారులు వెల్లడించారు.