కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్తో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. అల్వాల్ సర్కిల్ పరిధి మూడు డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి సమస్యలపై గురువారం చర్చించారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధి ఏడు కాలనీల డ్రైన్ ఔట్లేట్ సమస్య, అల్వాల్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ప్రభుత్వ లైబ్రరీ ఏర్పాటు, మూడు డివిజన్లకు సంబంధించి ఇది వరకే పంపించిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.