హైదరాబాద్లో బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం అంబర్పేట నియోజకవర్గం గోల్నాకకు చేరుకున్నారు. తులసి రాం నగర్ బస్తీలో పర్యటిస్తూ బాధితులు, స్థానికులతో మాట్లాడారు. మూసీ బాధితులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వారికి భరోసా ఇచ్చారు. రాత్రికి బస్తీ వాసులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రించారు.