దేవి శరన్నవరాత్రులు సందర్భంగా సైదాబాద్ లోకయుక్త కాలనీలో శుక్రవారం పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నం. తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బతుకమ్మలోనే చూస్తున్నారు. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.