కాంగ్రెసోళ్ల ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆల్విన్ కాలనీలో ఎర్రవల్లి సతీష్ రావు అధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా అయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ది గాలికి వదిలేసి కేసీఆర్ ను తిట్టేందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ప్రశ్నించారు.