తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. తన వివరాలను సర్వే అధికారులకు అందజేశారు. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలకు పునాదిగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.