బాలానగర్ డివిజన్ పరిధి కళ్యాణ్ నగర్, సాయినగర్ కాలనీల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మంగళవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ వెంటనే తగు చర్యలు చేపడతామని కార్పొరేటర్ రవీందర్ రెడ్డికి హామీ ఇచ్చారు.