ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మంచి వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయా రెడ్డి అన్నారు. బుధవారం పంజాగుట్టలోని ప్రతాప్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటర్ సందర్శించారు. పాఠశాలలో టాయిలెట్స్, ఆర్వో వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. వీటి మరమ్మతుల కోసం రూ. 15 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వీటితో పాటు బెంచ్ లు, కిటికీల మరమ్మతులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.