ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థి అరుణ్ కుమార్ యాదవ్ జాతీయ ప్రత్యేక మారథాన్ సమైక్యత శిబిరానికి ఎంపిక అయ్యాడు. అస్సాం రాష్ట్రంలో కోబ్రజార్ ప్రాంతంలో ఈనెల 10వ తేదీ నుంచి 19 తేదీ వరకు మారథాన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మంగళవారం అభినందిస్తూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడారు. ఇది కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు.