ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ. 35కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం బుధవారం తెలిపారు. ఈ నిధులను అవసరమైన చోట్లలో ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జీహెచ్ఎంసీ, జలమండలికి చెందిన అన్ని డివిజన్ల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బస్తీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.