ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పార్కింగ్ లాట్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మత్స్య శాఖ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేపల కూరలు చేపలతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు.