ఈ నెల 21, 22 తేదీల్లో భారత రాష్ట్రపతి రెండు రోజులపాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.