జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో శ్రీనగర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జీష్ణు దేవ్ వర్మను హైదరాబాద్ లో బుధవారం కలిశారు. ఈ బృందానికి పీఐజీ హైదరాబాద్ ఏడీజీ శృతి పాటిల్ ఇతర అధికారులు నేతృత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్ మీడియా ప్రతినిధులు తెలంగాణలో 5 రోజుల పాటు పర్యటించి రాష్ట్రంలో పలు అంశాలను అధ్యయనం చేయనున్నారు.