సమగ్ర కుటుంబ సర్వే ప్రజలందరికి సంక్షేమ పథకాలు సులువుగా అందేందుకు తోడ్పడుతుందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. అధికారులకు మేయర్ విజయలక్ష్మి తన కుటుంబ వివరాలను అందజేశారు. ప్రజలందరూ సమగ్ర కుటుంబ సభ్యులకు సహకరించాలని కోరారు.