ఎలాంటి అనుమతులు లేని 5 భవనాలు సీజ్
బీఎన్ రెడ్డి నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 5 బహుళ అంతస్తుల భవనాలను బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకోబోయారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాలను సీజ్ చేశారు.