గుండెపోటుతో సురేష్(30) అనే యువకుడు మృతి చెందాడు. విజయవాడ ప్రాంతానికి చెందిన అతను ఎలక్ట్రిషియన్ గా తన స్నేహితుడితో కలిసి రహమత్ నగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం ఛాతీలో నొప్పి వస్తోందని అసుపత్రికి వెళ్లడానికి అతని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్తూ మొదటి అంతస్తు నుంచి దిగుతూ కుప్పకూలాడు. అంబులెన్సు సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.