ఉత్తర భారతీయులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ కో ఆర్డినేటర్ నిర్మల్ కుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గంలోని లక్షకు పైగా ఉత్తర భారతీయులు ఉన్నారని, ఉత్తర భారతీయులైన తమకు పదవి ఇచ్చి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.