ధూల్ పేట కేంద్రంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు ఆరెస్టు చేశారు. వీరి వద్ద నుండి మూడు బైకులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ధూల్ పేట, పురానాపూల్ తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నారని సమాచారం రావడంతో గురువారం సాయంత్రం దాడులు నిర్వహించగా 2.310 కిలోల గంజాయి లభించింది. కాగా మరికొందరు పరారీలో ఉన్నారు.