కొండా సురేఖ, రఘునందన్ ఫోటోల ఎడిట్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖకి ఎంపీ రఘునందన్ ఓ చేనేత కండువాను వేశారు. దీనిని ఎడిట్ చేసిన నిందితులు అసభ్యకరరీతిలో పోస్ట్ చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే నిజామాబాద్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాలకు చెందిన వ్యాపారవేత్త మహేష్ గా పోలీసులు గుర్తించారు.