రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంగళవారం హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. చేతకాని వాడికి మాటలు ఎక్కువ చేవలేనోనికి బూతులెక్కువ అనేలా రేవంత్ తీరు, 11 నెలల పాలనలో నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదన్నారు. విజయోత్సవ సభలో చెప్పుకోవడానికి ఏమీ లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఎంత గింజుకున్నా లాభం లేదు అశోక్‌నగర్ నుంచి లగచర్ల వరకు మీరు చేసిన ఘోరాలు ప్రజలు మరిచిపోరంటూ మండిపడ్డారు.