పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టీ చట్ట సభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీలందరు సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గుజ్జ కృష్ణ, గోనెగే మల్లేష్, వేముల రామకృష్ణ పాల్గొన్నారు