హైదరాబాద్లో శనివారం ఆకతాయిలు హల్చల్ చేశారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం కొందరు ఆకతాయిలు బేకరిలో కేకులు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే బేకరీ యజమాని వారిని పట్టుకొని మందలించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆకతాయిలు అందరూ చూస్తుండగానే.. వ్యాపారిపై దాడికి దిగారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.