కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలు ఆయన పర్యవేక్షణలో జరగనున్నాయి. ఆయన కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.