రాజకీయంగా ఎవరి మీదా కేసు పెట్టాలని ప్రభుత్వం చూడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీపై స్పందిస్తూ అర్ధరాత్రి డీజే సౌండ్ పెట్టి చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగించారు. ప్రభుత్వానికి ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలు లేవు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. HYD బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోం' అని అన్నారు.