తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లను ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. క్వింటాకు రూ.500 చొప్పున బ్యాంకు అకౌంట్లలో నగదు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. రైతులకు బోనస్ డబ్బులు అందుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.