విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శుక్రవారం మదనాపురంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, బాలల హక్కులు, మహిళల హక్కులపై, అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వై. జానకి, ప్రిన్సిపల్ పరమేశ్వర్ పాల్గొన్నారు.