గత ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పేరుతో దర్గాలను కూల్చిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డిని విమర్శించడం తగదని కాంగ్రెస్ మైనార్టీ నేతలు అన్నారు. ఆదివారం పార్టీ ఆఫీస్ లో మైనారిటీ నేతలు లతీఫ్, రఫీక్, అస్లాం, మన్సూర్ అలీ, రేష్మబేగంలు మాట్లాడుతూ.. పట్టణంలోని నల్లచెరువు దగ్గర ఏర్పాటు చేసిన మహబూబ్ సుభహని దర్గాలో సొంత డబ్బుతో వసతులు కల్పిస్తున్న ఎమ్మెల్యేను విమర్శించడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హెచ్చరించారు.