రైతుల సంక్షేమం అజెండాగా ప్రభుత్వం పని చేస్తుంది: మేఘా రెడ్డి

84பார்த்தது
రైతుల సంక్షేమం అజెండాగా ప్రభుత్వం పని చేస్తుంది: మేఘా రెడ్డి
రైతుల సంక్షేమం అజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకారంలో మేఘా రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంగా ప్రమాణం చేసిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా పార్టీలకతీతంగా అక్కున చేర్చుకొని పనిచేయాలని చెప్పారు. వచ్చిన పదవికి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி