నారాయణపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేసింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, 245 గ్రామాలతో నూడ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అథారిటీ ఏర్పాటు చేయడం పట్ల నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సలీంలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణిక రెడ్డి, శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.