నారాయణపేట పట్టణంలోని అనాధ పిల్లల ఆశ్రమాన్ని గురువారం సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను సిబ్బంది మరియు పిల్లల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆశ్రమం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం గట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. పిల్లలకు పండ్లు, బిస్కట్లు అందజేశారు.