మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థుల కోసం అన్ని వసతి సౌకర్యాలతో వసతి గృహాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేటలోని బృందావన్ కాలనీలో ప్రైవేట్ వ్యక్తికి చెందిన బహుళ అంతస్తులో మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. విశాలమైన ఒక్కో గదిలో ముగ్గురు విద్యార్థులు ఉండేలా కల్పించిన వసతులను పరిశీలించారు.