హైద్రాబాద్ లో సోమవారం నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నట్లు నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో మాట్లాడుతూ. జీఓ 317 ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, వారి పాత జిల్లాలకు బదిలీ చేయాలని అన్నారు. సీపీస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని ప్రైమరీ స్కూల్స్ లలో హెడ్మాస్టర్ లను నియమించాలని అన్నారు.