సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం నారాయణపేట మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో కొనసాగుతున్న డాటా ఎంట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కుటుంబాల వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.