నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో భ్రూణహత్యలు నివారించి, ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా వైద్యఅధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని గుర్తించాలన్నారు.