మానవ విలువతో కూడిన విద్యను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం కుమేర పాఠశాలలో ప్రోగ్రాంకు హాజరయ్యారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి సీఎస్ఆర్ మాదిరిగానే ఏఎస్ఆర్ కూడా అవసరమన్నారు.