దీపావళి పర్వదినాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలతో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.