వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి శనివారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి రావడంతో సర్వేకు వచ్చిన అధికారులకు సర్వే వివరాలను వివరించారు. ప్రజలు సర్వేకు వచ్చిన అధికారులకు సహకరించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వేను పకడ్భందీగా నిర్వహించాలన్నారు. సర్వే చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. తప్పులు లేకుండా కుటుంబ యజమాని ద్వారా పూర్తి వివరాలు సేకరించి నమోదు చేయాలని అన్నారు.