నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. భూమి పంచాయతీలు 10, ఇతర రకాల సమస్యలకు సంబంధించి 3 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తామని తెలిపారు.