జడ్చర్ల: మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్ఓసి అందజేత
జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన జంగమ్మ రామచంద్రయ్య మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సహకారంతో 2, 50, 000/- ఎల్ఓసిని మంజూరు చేయించి మంగళవారం రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ జి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదగా అందజేశారు.