మహబూబ్ నగర్ జిల్లా బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.